తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్: 22 ( షేక్ గౌస్)
నిజామాబాద్: బోధన్ మండలం భవానిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అగ్రవర్ణ వర్గాలు అడ్డంకులు కలిగిస్తున్నాయని దళిత నాయకుడు బంగారు సాయిలు, MPJ జిల్లా అధ్యక్షుడు శేఖ్ హుస్సేన్, సక్కి విజయ్ ఆరోపించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వారు జిల్లా సబ్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
విగ్రహ స్థాపనకు తక్షణ అనుమతులు ఇచ్చి ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే, విగ్రహ ప్రతిష్ఠాపనకు అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రవి, ప్రభంజన్, గ్రామస్థులు పాల్గొన్నారు.