నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:20
నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ సిబ్బందికి ప్రతీదినం మండుటెండలో ఎండ తీవ్రతను తట్టుకొని విధులు నిర్వహిస్తూనారన్నా ఉద్దేశ్వంతో వారికి కంటికి చలువ దనమును ఇచ్చే కంటి అద్దాలను మరియు కూలీంగ్ స్టోరేజీ వాటర్ బాటిల్స్ లను నిజామాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో పోలీస్ క్యాంపు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ చేతుల మీదుగా సిబ్బందికి పంపిని చేయడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ అతినీలోహిత కిరణాల వలన జబ్బులు వచ్చి అనారోగ్యానికి గురి అవుతున్న సందర్భంగా ఇట్టి కంటి అద్దాలను సిబ్బంది ప్రతీ ఒక్కరు తప్పక ధరించి చక్కగ సద్వీనియోగం పరుచుకోగలరని, వీటి వలన దుమ్ము, దుళ్లి కంటికి ఎలాంటి ప్రమాదం కలుగదని, మరియు సిబ్బంది ఎప్పటికప్పుడు మంచినీటి బాటిల్స్ ఉపయో గించుకోవాలని, సిబ్బంది ప్రతీఒక్కరు ప్రజలతో మర్యాదతో వ్యవహరించాలని, సిబ్బందికి ఎలాంటి అవసరాలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.ఈ కార్యాక్రమంలో ట్రాఫిక్ ఎ.సి.పి శ్రీ నారాయణ , CI ప్రసాద్, రవీంద్ర ఫార్మసి అధ్యక్షులు మధు సుధన్, శ్రీధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సుధాకర్, సంతోష్, ట్రేజరర్ శ్రీ సాయిలు, మల్లేష్ మరియు ట్రాఫిక్ SI లు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.