పసుపు పండగ ..పెరిగిన గిట్టుబాటు ధర ……. 12 వేలకు చేరువైంది …..ఊపిరి పీల్చుకున్న రైతాంగం ఫలించిన ఆందోళన లు ….మార్కెట్ కు పోటెత్తిన పంట

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18
పసుపు రైతుల కష్టాలు కొంత మేరకు తీరాయి. పసుపు ధర అనూహ్యంగా పెరిగింది. మూడు రోజుల హొలీ పండగ సెలవు ల తర్వాత మార్కెట్ పసుపు పోటెత్తింది. సీజన్ మొదట్లో ఆరు వేలు పలికిన పసుపు ధర రైతులు రోడెక్కడంతో వ్యాపారులు దిగివచ్చారు. మద్దతు ధర పెంచేశారు.సోమవారం పసుపు ధర దాదాపు సాంగ్లీ మార్కెట్ తో పోటీ పడింది క్వింటాల్ ధర 12 వేల కు పలికింది. మంగళవారం కూడా అదే ట్రెండ్ కొనసాగింది పసుపు అమ్మకాలు జోరుగా సాగాయి. మొదటి రకం పసుపు కు కనీసం రూ 11 వేల తక్కువ కాకుండా ట్రేడ్ అవుతుంది.పసుపు ధర బాగా పలికే సాంగ్లీ మార్కెట్ లో రూ 13 వేల పలుకు తుంది. అందుకే రవాణా వ్యయం ను దృష్టి లో పెట్టుకొని రైతులు పసుపు నిజామాబాద్ మార్కెట్ కే తరలిస్తున్నారు..సీజన్ మొదట్లో పసుపు పచ్చిగా వుండడం తో క్వింటాల్ ఆరు వేల రూపాయలకు మించి అమ్ముడు పోలేదు.దీనితో ఆగ్రహించిన పసుపు రైతులు ఆందోళనలకు దిగారు. కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసినా సరే పసుపు ధర పడిపోవడంరాజకీయ రచ్చకు దారి తీసింది.కాంగ్రెస్ బీజేపీ నేతలు ఒకరిమీద మరొకరు విరుచుకపడ్డారు. నేతలు మార్కెట్ యార్డు లకు బారులు తీరారు పసుపు రైతులపరామర్శల షో చేశారు.మరో వైపు పొరుగునే ఉన్న సాంగ్లీ మార్కెట్ లో రూ 12 వేల కు అమ్మడు పోతుండడంతో రైతులు తమ సరుకు సాంగ్లీ మార్కెట్ కే తీసుకెళ్లారు. సహజంగానే స్థానిక వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తం అయింది. ఈలోపు మార్కెట్ కు హోలీ సెలవులు వచ్చాయి .సోమవారం ఎవ్వరికి అంచనాలకు అదనంతగా ధర పలకడం తో పసుపు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం వేల్పూర్ కు చెందిన ఓ రైతు పసుపు మొదటి రకం క్వింటాల్ కు రూ. 12 వేల రూపాయలు అమ్మడు పోయింది.దీనితో రైతులు పసుపు తో మార్కెట్ ముంచెత్తారు. మంగళవారం తాను క్వింటాల్ కు రూ 11987 ధర పలికిందన ఆర్మూర్ మండలం చిట్టాపూర్ రైతు చెప్పారు.పసుపు మార్కెట్ కు వచ్చిన మొదట్లో తేమ శాతం ఎక్కువగా వుండడం వల్లే కొనుగోలు చేయడానికి ట్రేడర్లు ముందుకు రాలేదని అందువల్లే ధర పలక లేదని రైతులు చెప్తున్నారు.మరో ఎండలు కూడా తీవ్రం కావడంతో పసుపు బాగా ఎండి తేమ శాతం తగ్గిపోవడంతో పసుపు కొనుగోలు చేయడానికి ట్రేడర్లు ఆసక్తి చూపిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Latest Stories

Leave a Comment

error: Content is protected !!