నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18
నిజామాబాద్ జిల్లా నుంచి సిద్దిపేటకు నూతన ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభిస్తున్నట్లు నిజామాబాద్-2 డిపో మేనేజర్ సాయన్న సోమవారం తెలిపారు. ఈ బస్సులు నిజామాబాద్ నుండి కామారెడ్డి మీదుగా సిద్దిపేట వరకు నడపనున్నట్లు వెల్లడించారు. కావున ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సంస్థను ఆదరించాలని తెలిపారు.