నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30
నందిపేట్ మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున ఐదు ఇళ్లలో దొంగతనం జరిగింది. జుడా చర్చి సమీపంలోని ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగలు చోరీ చేశారు. ఉదయం 3 గంటల ప్రాంతంలో వేర్వేరు ఇళ్లలో దొంగతనం జరిగినట్లు సీసీ కెమెరా రికార్డింగ్ ఆధారంగా తెలుస్తోంది. ఇసుక కొండయ్య ఇంట్లో 3 తులాల బంగారం మరియు కొంత నగదు దొంగలు అపహరించారు. మిగతా ఇళ్లలో విలువైన వస్తువులు దొరకకపోవడంతో వస్తువులు చిందరవందరగా వదిలివెళ్లారు.సమాచారం అందుకున్న ఎస్‌ఐ చిరంజీవి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు ఇళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌కు అందజేయాలని, ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.