నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ .నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఐపీఎస్ తెలిపిన వివరాల ప్రకారం దీపావళి పండుగ సందర్భంగా ఆర్మూర్, నిజామాబాద్, బోధన్,డివిజన్ లాలో పేకాట ఆడుతున్న 597 మంది పై కేసు నమోదు చేశారు . పోలీసులు నిఘా సారించి వేర్వేరు పేకాటస్థవరాలపై దాడి చేసి 116 కేసులు నమోదు కాగా రూ॥ 11,47,240/- స్వాదీనం చేసుకున్నారు.
దీపావళి పండుగ సందర్బంగా పేకాట స్థావరాలపై నియంత్రించడానికి ప్రత్యేక నిఘా, ప్రత్యేక టీం మరియు కంట్రోల్ రూం ఏర్పాటుచేయడం జరిగిందని ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ తెలిపారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి పేకాటలో116 కేసులు నమోదు
Updated On: November 2, 2024 7:31 pm
