నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ .
నేడు నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ శ్రీమతి సిహెచ్ సింధు శర్మ ఐపీఎస్ మాట్లాడుతూ ప్రజలందరికి అక్టోబర్ 31న జరుపుకునే దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంవత్సర కాలంలో ప్రజలందరు వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయురారోగ్యాలతో మరియు సుఖ సంతోషములతో కాలము గడుపవలయును అని తెలిపారు.అహంకారం, స్వార్థం, అసూయలతో కూడిన చీకట్లను పారద్రోలి మంచి దీపం ” వెలిగించి పది మందికి వెలుతురును ఇవ్వాలనీ. పిల్లలు బాణ సంచాలు కాల్చేటప్పుడు కుటుంబ పెద్దలు దగ్గర ఉండి తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ కమిషనర్
Updated On: November 2, 2024 7:31 pm









