డిజిటల్ ప్రచారం – డోర్ టు డోర్ క్యాంపెయిన్‌తో దూసుకుపోతున్న కే రాజు.
డాక్టర్ మిస్బా, అష్రఫ్ ఖాన్ ఆద్వర్యం లో ఇంటింటా ప్రచారం
పోచంపాడ్ గ్రామం | ప్రత్యేక కథనం..
పోచంపాడ్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 14 : ఈనెల 17వ తేదీన జరగబోయే సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోచంపాడ్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో డిజిటల్ ప్రచారంతో పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్ ను సమాంతరంగా కొనసాగిస్తూ కే రాజు గెలుపు దిశగా వేగంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం.గ్రామాభివృద్ధిపై తన ఆలోచనలు, ప్రణాళికలను ప్రజలకు చేరువ చేస్తున్నారని స్థానిక వర్గాలు తెలిపాయి.ఈ డిజిటల్ ప్రచారానికి యువతతో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి హామీలు ఇస్తూ డోర్ టు డోర్ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ విధానం ద్వారా గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల మద్దతు తెలుపుతున్నారని కే రాజు తెలిపారు.ప్రచారంలో ముందంజలో ఉన్న నేపథ్యంలో గ్రామంలో అనుకూల వాతావరణం నెలకొన్నదని, ఇక మిగిలింది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించడమే అన్న చర్చ వినిపిస్తోంది. ప్రజలు తమ అమూల్యమైన ఓటుని కత్తెర గుర్తుకి వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కే రాజు,డాక్టర్ మిస్బా, అష్రాఫ్ ఖాన్,కోరారు.ఈ కార్యక్రమంలో నజీర్, భాస్కర్, టైలర్ సంజు, షేక్ పాషా, మోసిన్,బారి, మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.











