నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 07 : ఎన్నికలు పక్కాగా నిర్వహించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో సూచించారు. ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఎన్నికల అధికారులతో ఆదివారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో సమావేశం అయ్యారు. కోటగిరి రైతు వేదికలో, పోతంగల్ మండల కేంద్రంలోని సాయిబాబా కల్యాణ మండపంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ గంగాధర్, కోటగిరి ఎంపీడీవో విష్ణు, పోతంగల్ ఎంపీడీవో చందర్, ఎంఈవో శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలు పక్కాగా నిర్వహించాలి.
Published On: December 7, 2025 11:00 pm











