నిజామాబాద్ జై భారత్ మే :27 కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని మంగళవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే వివాహవార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీవారి కళ్యాణం జరిపించి వేద పండితుల చేతులమీదుగా ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో నిజామాబాద్ నియోజకవర్గం ప్రజలందరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ముఖ్యంగా రైతులకు సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
Published On: May 27, 2025 8:50 pm
