నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 21.
కుంభమేళాలో ఆశ్రమం సేవా కార్యక్రమాలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆశ్రమాధిపతి శ్రీ మంగి మహారాజ్ నేతృత్వంలో ప్రతి రోజు 4000 మందికి ఇడ్లీ, సాంబార్ ఉచితంగా పంపిణీ చేస్తూ భక్తుల ప్రశంసలను అందుకుంటోంది.నందిపేట్ నుండి దేశమంతటికి సేవల విస్తరణ..నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమం గతంలోనే పేదవారికి ఆర్థిక సాయం, నిరాశ్రయులకు ఆశ్రయం, గోశాల నిర్వహణ, నిత్యాన్నదానం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి పేరు పొందింది. ఇప్పుడు ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది.ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో ఆశ్రమం ప్రారంభించిన “హద్దులేని సేవ” కార్యక్రమం దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించే ప్రయత్నంలో ఉంది. మతసామరస్యాన్ని, మానవత్వాన్ని పెంపొందించడంలో ఈ ఆశ్రమం కీలక పాత్ర పోషిస్తోంది.శ్రీ మంగి మహారాజ్ నాయకత్వంలో నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమం ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవల్లోనూ కీలక పాత్ర పోషిస్తూ, దేశానికి ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తోంది అని నందిపేట్ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.