నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 1.
ఆర్మూర్ పట్టణ కేంద్రంలో మాలల హక్కుల కోసం నిరంతరం భీమా కోరేగావ్ మహర్ యుద్ధ వీరుల స్ఫూర్తితో పోరాడుదామని మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కో-చైర్మన్ అంగరి ప్రదీప్ పిలుపునిచ్చారు. బుధవారం ఆర్మూర్ మండల కేంద్రంలో బీమా కోరేగావ్ 207వ శౌర్య దివస్‌ని పురస్కరించుకుని మాల సంఘాల జేఏసీ,అంబేద్కర్ యువజన సంఘం,దళిత ఐక్య సంఘటన, యశోబుద్ధ ఫౌండేషన్, వివిధ దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో భీమాకోరేగావ్ విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌక్‌లో వివిధ దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేశారు. అనంతరం భీమా కోరేగావ్‌లో 1818 జనవరి 1న జరిగిన యుద్ధంలో వీరమరణం పొంది అమరులైన మహర్ సైనికుల అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.యశో బుద్ధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుద్ద వందన చేసి నూతన సంవత్సర కలమణిని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు ఆర్గుల్ సురేష్,డి లింగన్నమాల,కొంతం మురళీ,మార్ల ప్రభాకర్ ,పింజ భూమేశ్వర్ లు మాట్లాడుతూ బ్రాహ్మణ పీష్వాలపై మహర్ రెజిమెంట్ పోరాట యోధుల యుద్ధ విజయానికి చిహ్నమే భీమాకోరేగావ్ శౌర్య దివాస్ అని 500మంది మహార్ వీరులు, 28వేల మంది పీష్వా బ్రాహ్మణ సైన్యంతో మహారాష్ట్ర కోరేగావ్‌లో భీమా నది వద్ద భీకర యుద్ధం చేసి విజయం సాధంచారని వివరించారు.మహర్ వీరుల స్ఫూర్తితో మనువాదనికి వ్యతిరేకంగా పోరాడుతామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు అనంతరం సామాజిక సేవ విభాగంలో గౌరవ డాక్టరేట్ సాధించిన రిటైర్డ్ టీచర్ మాదరి రాజన్న ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మట్టా అమృత్ రావు,అబ్దుల్ హుస్సేన్, జిన్నా జనార్దన్, వికాస్ పవర్,కొంతం పూర్ణ,అంబులెన్స్ రాజు,టీం నాయకులు, బుద్దిస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.