అంత్యక్రియల్లో పాల్గొన్న బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12.

బాన్సువాడ మాజీ సర్పంచ్ దివంగత శ్రీ కొర్ల సంగా రెడ్డి  కూతురు  కంచర్ల లక్ష్మి, మనుమడు  కంచర్ల అక్షయ్ రెడ్డి గార్ల అంత్యక్రియల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు  పోచారం శ్రీనివాసరెడ్డి ,రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్  కాసుల బాలరాజు ,మాజీ నిజామాబాద్ డిసిసిబి చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి ,శ్రీ పోచారం సురేందర్ రెడ్డి ఈనెల 8 వ తేదీన బిక్నూర్ జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ మాజీ సర్పంచ్ దివంగత  కొర్ల సంగారెడ్డి  కూతురు  కంచర్ల లక్ష్మి,మనవడు కంచర్ల అక్షయ్ రెడ్డి మరణించారు.ఈరోజు బాన్సువాడలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొని పార్థివదేహాలకి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు . ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!