తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 15.
దెగ్లూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బిలోలి తాలూకా సావళి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అసెంబ్లీ అభ్యర్థి నివర్తి రావు కు మద్దతుగా గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందని ప్రజలు ఒకసారి ఆలోచించి ప్రభుత్వ ఏర్పాటు కొరకు కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ పటేల్ , వసీం ఫారూఖీ , సలీం ,ఇమ్రాన్ షకీల్, నాయకులు వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, నాయకులు నేమాని బుజ్జి , మూర్తి.భారి,సాయిలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు