ఈరోజు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు తెలంగాణ ఎమ్మెల్యేలతో కలిసి లండన్ లోని థేమ్స్ రివర్ ఫ్రంట్ ను పర్యవేక్షించారు.తెలంగాణ ప్రభుత్వం లండన్ లోని థేమ్స్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపడుతున్న సందర్భంగా..
లండన్ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ థేమ్స్ నదిని నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేశారు..
అదే మోడల్ లో హైదరాబాద్ లో మూసీనదిని పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న ప్రణాళికలను, ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్ లైన్, థేమ్స్ నది తరహాలో అభివృద్ధి, తదితర అంశాల గురించి ఎమ్మెల్యేల బృందం చర్చించినట్లు తెలిపారు..
థేమ్స్ రివర్ ఫ్రంట్ ను సందర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
Published On: November 7, 2024 11:09 pm
