సాయిబాబాకు ఎస్సీ ఎస్టీ బీసీల జోహార్లు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ మేడిపల్లి నవంబర్ 5: 

ఇటీవల అమరుడైన హక్కుల ప్రదాత దివంగత జీ.ఎన్ సాయిబాబాకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఘనంగా నివాళి అర్పించారు. మంగళవారం మధ్యాహ్నం ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో సాయిబాబా సంస్మరణ సభ జరిపారు. ఇందులో ప్రత్యేకంగా విచ్చేసిన తెలంగాణ పీపుల్స్ జె.ఎ.సీ జగిత్యాల ప్రముఖులు పొన్నం రాజామల్లయ్య మాట్లాడుతూ సాయిబాబా తన జీవితాంతం అన్ని జాతుల హక్కులు, అధికారాలు, శస్యసామల జీవితం కోసం నిరంతరంగా కృషి చేశారని, అది ఓర్వలేని మనువాద ప్రభుత్వాలు ఆయనను అన్యాయంగా జైలు పాలు చేయడమే గాకుండా, ఆతికిరాతకంగా హింసించారని ఆరోపించారు. ఇలాంటి రాజ్య దుశ్చర్యలు పునరావృతం కాకుండా దేశప్రజలు సమయత్తం కావాలని రాజమల్లయ్య పిలుపునిచ్చారు. ముంబై నుంచి విచ్చేసిన బహుజన మేధావి మూలనివాసి మాలజీ మాట్లాడుతూ కాళ్ళు లేని వ్యక్తిని దిమాగ్ లేని ప్రభుత్వాలు నిర్బంధించి చంపడం ప్రజాస్వామ్యానికే మచ్చఅని దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితిలో వామపక్షవాదం అంబేడ్కర్ వాదం ఐక్యతయే సాయిబాబాకు నిజమైన నివాళి అంటూ కొండాపూర్ మాజీ సర్పంచ్ ఎం.హనుమంతు ఈ మేరకు బహుజన శ్రామిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్య్రమంలో ఎ. గంగరాజం, బొల్లె రాజయ్య, చెల్మల్ల గంగాధర్, బి.గంగారాజం, డప్పు ప్రేమ్, ఎ.రఘు, పిట్ల నారాయణ, ఎ.వై.ఎస్ నిజమాబాద్ జిల్లా అధ్యక్షులు ఇత్వార్ పేట్ లింగన్న, కాపు బోజన్న, జర్నలిస్ట్ మామిడి రాజు, సీపీఐ ఎద్దండి భూమయ్య చేతులెత్తి జోహార్లు తెల్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!