సిరికొండ, 2023-08-31
సిరికొండ మండల పరిధిలోని సర్పంచ్ తండాలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురికినీరు రోడ్లపై ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో బైకులపై వెళ్లేవారి దుస్తులపై మురికినీరు పడి ఇబ్బందులు పడుతున్నామని, సర్పంచ్ తాండ యువకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అలాగే, పోడు భూముల సమస్యలపై కూడా అటవీశాఖ అధికారులపై ఫిర్యాదులు అందాయి.
సిరికొండ మండల పరిధిలోని సర్పంచ్ తండాలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురికినీరు రోడ్లపై ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో బైకులపై వెళ్లేవారి దుస్తులపై మురికినీరు పడి ఇబ్బందులు పడుతున్నామని, సర్పంచ్ తండాలో మురికి కాలువలు నిర్మించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుతూ సర్పంచ్ తాండ యువకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
అక్రమ నిర్మాణాలపై ఏసీబీ విచారణకు విజ్ఞప్తి
మండల కేంద్రంలో స్థలం విషయంలో కోర్టులో కేసు నడుస్తుండగా కొందరు ఇళ్లు నిర్మించుకున్నారని, అందుకు సహకరించిన అధికారులపై ఏసీబీ విచారణ జరిపించాలని కూడా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని యువకులు కోరారు.
పోడు భూములపై అటవీశాఖ అధికారుల తీరుపై ఫిర్యాదు
మైలారం గ్రామానికి చెందిన కొందరు తమకు పోడు భూముల పట్టాలు ఉన్నప్పటికీ, పొలం పనులు చేసుకోకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకొని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజావాణిలో వాపోయారు. మైలారం గ్రామంలోని పేద కుటుంబాలకు చెందిన తాము పొలం పనులు చేసుకునేందుకు సహకరించాలని ప్రజావాణి అధికారులకు విజ్ఞప్తి చేశారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 7, హౌసింగ్ 2, పంచాయతీరాజ్ 1, అటవీ శాఖ 2, విద్యుత్ శాఖ 1, విద్యాశాఖకు సంబంధించి 1 ఫిర్యాదుతో సహా మొత్తం 14 ఫిర్యాదులు అందినట్లు తహసిల్దార్ రవీందర్రావు, ఎంపీడీవో ఆరిఫ్ మహమ్మద్ తెలిపారు. ప్రజావాణిలో వివిధ శాఖల అధికారులు పాల్గొని, ప్రజల సమస్యలను ఆలకించారు.












