నిజామాబాద్, 7 September
ముచ్కూర్ గ్రామంలో మహిళా గ్రామ సంఘం నూతన భవన నిర్మాణానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామ సంఘ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచ్ ఆదేశించారు.
మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ ముచ్కూర్ గ్రామంలో మహిళ గ్రామ సంఘం నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది . భారత్ స్పెక్ట్రమ్ తెలుగు దినపత్రిక భీంగల్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపడుతున్న గ్రామ సంఘ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచ్ ఆదేశించారు. ఈ భవనానికి స్వచ్ఛభారత్ నిధులతో మరుగుదొడ్ల నిర్మాణానికి మంజూరు ఇస్తామని తెలిపారు మహిళలు ఆర్థిక అభివృద్ధి తోపాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంకుడు గుంతల నిర్మాణము లో ప్రధాన భూమిక వహించాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ఏపీవో జీ నర్సయ్య ఏపీఎం ప్రమీల పంచాయతీ కార్యదర్శి సంజీవ్ గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామ సంఘం మహిళలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ,ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..












