నిజామాబాద్, 11 September
భీంగల్ పట్టణంలోని ఐదో వార్డు, చిన్న సంగం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోరు మోటార్‌ను వార్డు కౌన్సిలర్ లావణ్య నరసయ్య శుక్రవారం ప్రారంభించారు. స్థానిక ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ మోటార్‌ను ఏర్పాటు చేశారు.
ఐదో వార్డులో బోరు మోటార్ ప్రారంభం. భారత్ స్పెక్ట్రమ్ తెలుగు దినపత్రిక భీంగల్: భీంగల్ పట్టణంలోని ఐదో వార్డులో చిన్న సంగం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోరు మోటార్‌ను ఐదో వార్డు కౌన్సిలర్ లావణ్య నరసయ్య శుక్రవారం ప్రారంభించారు. స్థానిక ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బోరు మోటార్ ఏర్పాటు చేసినట్లు కౌన్సిలర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డులో నీటి సమస్య తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉండేలా పురపాలక సంఘం ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పనులకు మున్సిపల్ ఫైనాన్స్ ద్వారా 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించినట్లు పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులను సద్వినియోగం చేస్తూ వార్డులో అభివృద్ధి పనులను కొనసాగిస్తామని తెలిపారు. బోరు మోటార్ అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నే రాజేశ్వర్, కర్నె గంగారం, కర్నె లక్ష్మీనరసయ్య, బందెల రాజేశ్వర్, కొత్తంటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

