సిరికొండ, 2026-08-28
సిరికొండ మండలంలోని హుస్సేన్‌నగర్ గ్రామంలో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హులైన కుటుంబాలకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
సిరికొండ మండలంలోని హుస్సేన్‌నగర్ గ్రామంలో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హులైన కుటుంబాలకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్డుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ మరింత పారదర్శకంగా, సులభతరంగా మారుతుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన కుటుంబాలకు అందించేందుకు ఇవి ఉపయోగపడతాయని గ్రామస్థులు పేర్కొన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా కుటుంబ వివరాలు డిజిటల్ విధానంలో నమోదై ఉండటంతో, రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలు సక్రమంగా అందే అవకాశం ఉంటుందని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డు ఒక కీలకమైన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఈ సందర్భంగా హుస్సేన్‌నగర్ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ రమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు జీవన్ రెడ్డి, కారోబార్ పండరి, జయంతి మేడం, రేషన్ డీలర్ రాజారెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.












