వాల్గొట్ (భారత్ స్పెక్ట్రమ్) సెప్టెంబర్ 02
ప్రతి ఓటు ప్రజాస్వామ్యంలో కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని ఎంపీడీఓ రఫీ అహ్మద్ సూచించారు. చిన్న వాల్గొట్ గ్రామంలో నిర్వహించిన ఎస్ఐఆర్-2 కార్యక్రమంలో ఆయన పాల్గొని ఓటర్ల వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 170 ఓట్ల పునరుద్ధరణ జరిగింది.
ప్రతి ఓటూ విలువైనదే... ఓటు హక్కును కాపాడుకుందాం చిన్న వాల్గొట్లో ఎస్ఐఆర్-2 పరిశీలన.. 170 ఓట్లు పునరుద్ధరణ సిరికొండ , సెప్టెంబర్ 2(భారత్ స్పెక్ట్రామ్ ): ప్రతి ఓటు ప్రజాస్వామ్యంలో కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని ఎంపీడీఓ రఫీ అహ్మద్ సూచించారు. చిన్న వాల్గొట్ గ్రామంలో నిర్వహించిన ఎస్ఐఆర్-2 కార్యక్రమంలో ఆయన పాల్గొని ఓటర్లకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో మొత్తం 226 నోటీసులు జారీ కాగా, తగిన ఆధార పత్రాలు సమర్పించిన 170 మంది ఓటర్ల ఓట్లను ఆన్లైన్లో పునరుద్ధరించినట్లు ఎంపీడీఓ తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమకు సంబంధించిన తగిన పత్రాలను సమర్పించి ఓటును ఆన్లైన్లో పునరుద్ధరించుకోవచ్చని సూచించారు. ఓటు హక్కు ప్రతి అర్హుడైన పౌరుడికి ఎంతో విలువైనదని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అవసరమైన పత్రాలతో సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దడివే గణేష్, ఉపసర్పంచ్ గోవర్ధన్, పంచాయతీ కార్యదర్శి శరణ్య, కారోబార్ సాయిరాం, జీపీఓ నవీన్, బీఎల్ఓ ఉమారాణి, ప్రవీన్, గంగాధర్ తో పాటు గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.












