భీమ్గల్, 2026-06-05
భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారు. అర్హులైన లబ్ధిదారులకు ఈ అవకాశాన్ని కల్పించినట్లు మున్సిపల్ కమీషనర్ డి గజానంద్ తెలిపారు.
భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంజూరు చేసేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. ఈ మేరకు మున్సిపల్ కమీషనర్ డి గజానంద్ ఒక ప్రకటన విడుదల చేశారు.
కావున నూతన పింఛన్ల కోసం అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, పైలేరియా బాధితులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన వారు నిర్ణీత గడువులోగా నూతన పింఛన్ కోసం దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
ముఖ్యంగా ఒంటరి మహిళా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు గడువు తేదీకి కనీసం మూడు రోజుల ముందుగానే తమ దరఖాస్తులను మున్సిపల్ కార్యాలయంలో సమర్పించవలసిందిగా కోరడమైనది. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అవసరమైన పత్రాలతో దరఖాస్తులను మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని మున్సిపల్ కమీషనర్ కోరారు.












