హైదరాబాద్, 2026-06-05
ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా, ఆదివాసుల సంక్షేమం కోసం ప్రభుత్వం పోడు భూముల హక్కులు కల్పించాలని, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ఆదివాసుల జీవన విధానాన్ని గౌరవిస్తూ, వారి భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆదివాసుల ప్రాముఖ్యత
నేటి సమాజంలో ఆదివాసులు ప్రకృతి సంపదను కాపాడుతూ, ప్రత్యేక సంస్కృతిని, భాషలను, జీవన విధానాన్ని నిలబెట్టడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని కృపాల్ సింగ్ సోడి అన్నారు. దేశ జనాభాలో సుమారు 8.6 ఉన్న వీరు పర్యావరణ పరిరక్షణలో, జీవన వైవిధ్యాన్ని కాపాడడంలో ముందుంటున్నారు. అయితే, నేటి సమాజంలో అభివృద్ధి, మైనింగ్ ప్రాజెక్టుల కారణంగా అడవుల నుంచి నిర్వాసితులు కావడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ
వారి ప్రత్యేక భాషలు, సంస్కృతి కనుమరుగవుతున్నాయి. అయినప్పటికీ, విభిన్నమైన సాంప్రదాయాలు, కళలు, మౌలిక సాహిత్యాలు దేశ సంస్కృతికి మూలంగా ఇప్పటికీ ఉన్నాయని కొనియాడారు.
ప్రభుత్వానికి డిమాండ్లు
ప్రభుత్వం తక్షణమే ఆదివాసుల అభివృద్ధి కోసం పోడు భూముల హక్కులు కల్పించాలని, మెరుగైన విద్యా, వైద్య సదుపాయాలు అందించాలని, గిరిజన చట్టాలను కఠినంగా అమలు చేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు.