జై భారత్ దినపత్రిక వరంగల్ మే 04 : ఉమ్మడి వరంగల్ జిల్లా డిసిసి బ్యాంక్ సీఈవో.. నజీర్ సుల్తాన్ ని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానం చేసిన యువజన కాంగ్రెస్ కొండా యువసేన రాష్ట్ర నాయకులు సిలివేరు అనిల్.ఈ బ్యాంక్ ప్రారంభంతో కురవి మండలంలోని రైతులు మహిళా సంఘాలు చిన్న వ్యాపారులు మరియు సాధారణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత దగ్గరగా, సులభంగా అందుబాటులోకి రానున్నాయి ఇకపై ఖాతాలు తెరవడం,రుణాలు పొందడం, పొదుపు పథకాలు ఉపయోగించుకోవడం వంటి సేవలు స్థానికంగా పొందే అవకాశం కలిగిందని తెలిపారు.ఈ సందర్భంగా సిలివేరు అనిల్ మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ డాక్టరు రాంచంద్రనాయక్ ఆశీస్సులతో కురవి గ్రామ అభివృద్ధికి బ్యాంకింగ్ సేవలు కీలకమని, రైతులు మరియు మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని పేర్కొన్నారు .గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక చైతన్యం పెరగడం ద్వారా అభివృద్ధి వేగవంతం అవుతుందని అన్నారు.ప్రజలు బ్యాంకింగ్ సేవలను పూర్తిగా వినియోగించు కొని పొదుపు అలవాటు పెంపొందించుకోవాలని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు . కురవి మండల అభివృద్ధికి ఇది మరో ముఖ్యమైన అడుగు అని అందరూ హర్షం వ్యక్తం చేశారు.
కురవి మండల కేంద్రంలో డి.సి.సి బ్యాంక్ ప్రారంభం
Published On: May 5, 2026 9:31 am











