ఎంపీ ధర్మపురి అరవింద్
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ 02 : ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా మే 10 న పరేడ్ గ్రౌండ్లో జరిగే జన సమీకరణ సభ ను విజయవంతం చేయాలని ఎంపీ అర్వింద్ అన్నారు. ఈ విషయమై శనివారం కామారెడ్డి జిల్లా పదాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులకు సూచనలు చేస్తూ దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మాజీ శాసనసభ్యులు సైదిరెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజులు, జుక్కల్ మాజీ శాసన సభ్యురాలు అరుణాతార, మాజీ జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.









