నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 18: నిజామాబాద్ లో గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్డు వెలువడిన నాటి నుండి డిసెంబర్ 17 వరకు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కృషి చేసిన అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజలందరికి ఈ సందర్భంగా నా యొక్క కృతజ్ఞతలు.శాంతి భద్రతల కోసం కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఎనలేనికృషి చేయడం జరిగిందని ప్రజలు మరియు పోలీసు అధికారుల మధ్య సమన్వయంతోనే ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ఎంతో తోడ్పడటం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ తెలియజేశారు.
ప్రజల నహకారంతోనే గ్రామ వంచాయతి ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి
Published On: December 18, 2025 4:32 pm











