నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :17 ( షేక్ గౌస్)
వక్ఫ్ బోర్డు అంశంలో సుప్రీంకోర్టు గురువారం వెలువరించిన తీర్పు ముస్లిం సమాజానికి నైతిక విజయంగా నిలిచిందని ముస్లిం పర్సనల్ లా కమిటీ జిల్లా సభ్యుడు, ఖౌమీ తంజీమ్ నిజామాబాద్ జోన్ చైర్మన్ సుమీర్ అహ్మద్ పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఈ తీర్పు దిశానిర్దేశకంగా ఉండబోతుందని అభిప్రాయపడ్డారు.
ఈ కేసులో ముస్లింల తరఫున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాత్ర ప్రశంసనీయమని అన్నారు. ప్రత్యేకించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ప్రతినిధిత్వం చేస్తూ షబ్బీర్ అలీ ప్రత్యేకంగా పిటిషన్ వేయడం గర్వకారణమని, నిజామాబాద్ ముస్లింల తరపున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు తెలిపారు.ముస్లింల ఆస్తులు సమర్థవంతంగా రక్షించబడాలన్నదే ముస్లిం సమాజపు ప్రధాన ఆకాంక్ష అని, ఈ తీర్పుతో వక్ఫ్ బోర్డు హక్కులు మరింత బలపడతాయని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన న్యాయ పోరాటాలకు ఇది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని సుమీర్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు.