Bhimgal, 2026-06-05
భీంగల్ లోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని పండుగ ప్రాముఖ్యతను చాటారు.
భీంగల్ లో రాఖీ పండుగను పురస్కరించుకొని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్ లో ముందస్తుగా రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు వై. చంద్రశేఖర్ రాఖీ పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం బాలికలు బాలురకు నేను నీకు రక్ష - నీవు నాకు రక్ష - మనమందరం దేశానికి, ధర్మానికి రక్ష అంటూ రాఖీలు కట్టారు. పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు, ఆచార్యులకు కూడా రాఖీలు కట్టారు.
పాఠశాలలో రాఖీలు కట్టడం పూర్తయిన తర్వాత పి.రాజేందర్, సిహెచ్. కార్తీక్, డి శ్రీనివాస్, ఎన్. రాకేష్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బాలికలు భీంగల్ పట్టణంలోని వ్యాపార సంస్థలలో, ప్రభుత్వ కార్యాలయాలలో కూడా రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు పి.సాయిచరణ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రెడ్డి జి నర్సారెడ్డి, అకాడమిక్ ఇంచార్జ్ నోముల అశ్విన్ రెడ్డి, పి.ఈ.టీ లు ఎస్. నరేష్, ఐ గంగాధర్ మరియు ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.











