సిరికొండ, 9 September
మండలం, చిన్నవాల్గొట్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలలో భాగంగా ఈ దుస్తులను అందజేశారు.
విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం (భారత్ స్పెక్ట్రమ్ ): మండలం చిన్నవాల్గొట్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాల్లో భాగంగా విద్యార్థులకు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దడివే గణేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న దుస్తులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. ఈ సదుపాయం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు విద్యార్థులందరికీ సమానంగా పాఠశాల వాతావరణం కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ సంక్షేమ సదుపాయాలను అందించడం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు. ఉచిత దుస్తులు అందడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సమానత్వ భావన పెంపొందుతుందని, పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ చదువుపై మరింత దృష్టి పెట్టేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి, మహిళా సంఘం అధ్యక్షురాలు విజయ, మహిళా సంఘం సీసీ సత్యానందం, సీఏ రాజేశ్వర్, ఎఫ్ఏ రాజు తదితరులు పాల్గొన్నారు.


