Bhimgal, 12 September
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ఈగల్ ఫోర్స్ అడ్వైజర్ కొండవీటి శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. గ్రామ పొలిమేరల్లోకి చేరుతున్న మత్తు పదార్థాలను తరిమికొట్టి యువతను, విద్యార్థులను వాటి బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
*డ్రగ్స్ రహిత సమాజం కోసం కంకణబద్ధులవుదాం. గ్రామ పొలిమేరల్లోకి చేరిన మత్తు పదార్థాలను తరిమికొట్టాలి: ఈగల్ ఫోర్స్. భారత్ స్పెక్ట్రమ్ తెలుగు దినపత్రిక భీంగల్. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ఈగల్ ఫోర్స్ అడ్వైజర్ కొండవీటి శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. గ్రామ పొలిమేరల్లోకి చేరుతున్న మత్తు పదార్థాలను తరిమికొట్టి యువతను, విద్యార్థులను వాటి బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శనివారం మండలంలోని లింబాద్రిగుట్ట దేవస్థానంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల ఎంతోమంది జీవితాలు అతలాకుతలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు లాభాపేక్షతో మత్తు పదార్థాలను విక్రయిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్సై శంకర్ మాట్లాడుతూ, గ్రామాల్లో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి విక్రయాలు లేదా సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. గంజాయి సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉందన్నారు. గంజాయి సేవిస్తూ పట్టుబడితే చట్టపరమైన చర్యలతో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ టీం అడ్వైజర్లు ఉట్నూర్ సాగర్, అడ్వాల శ్రీనివాస్, పంతుల మనోహర్, కొనింటి అనిల్‌కుమార్, మీనుగు నాగరాజు, శెట్టి శ్రీనివాస్‌తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.










