నిజామాబాద్, 2026-09-09
బాసర నవీపేట్ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 55-60 ఏళ్ల వయసున్న మృతుడిని గుర్తించేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య: నిజామాబాద్ రైల్వే పోలీసులు బాసర – నవీపేట్ రైల్వే స్టేషన్ల మధ్య కిలోమీటర్ నంబర్ 432/34-35 వద్ద గుర్తుతెలియని రైలు కింద పడి సుమారు 55 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం (09.09.2026) తెల్లవారుజామున 01:55 గంటల కంటే ముందు చోటుచేసుకుంది. జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని గుర్తించడానికి ఘటనా స్థలంలో ఎటువంటి ఆధారాలు లభించలేదని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి ఆనవాళ్లు: వయస్సు: సుమారు 55 - 60 సంవత్సరాలు శరీర గుర్తులు: ఎడమ చేతిపై "కే.లక్ష్మి" అని పచ్చబొట్టు (టాటూ) ఉంది దుస్తులు: టి-షర్ట్, నిక్కర్ మరియు లుంగీ ధరించి ఉన్నాడు ఈ ఘటనపై నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 167/2026, సెక్షన్ 194 B.N.S.S కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి ఆనవాళ్లను బట్టి ఎవరైనా గుర్తిస్తే లేదా వివరాలు తెలిస్తే వెంటనే నిజామాబాద్ రైల్వే ఎస్సై శ్రీ హెచ్. సాయిరెడ్డి (ఫోన్ నెం: 8712658591) ను సంప్రదించాలని పోలీసులు కోరారు.











