సిరికొండ, 3 September
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మండల కేంద్రం సమీపంలో గల హుస్సేన్ నగర్ గ్రామ పరిధిలో బైక్పై టేకు దుంపలను అక్రమంగా తరలిస్తున్న వారిని అటవీ అధికారులు పట్టుకున్నారు. అటవీ అధికారులు గస్తీ నిర్వహిస్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
బైక్పై టేకు దుంపల తరలింపు.. పట్టుకున్న అటవీ అధికారులు :నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మండల కేంద్రం సమీపంలోని హుస్సేన్ నగర్ గ్రామ పరిధిలో బైక్పై టేకు దుంపలను తరలిస్తున్న వారిని అటవీ అధికారులు పట్టుకున్నారు. అటవీ అధికారులు గస్తీ నిర్వహిస్తుండగా బైక్పై టేకు దుంపలను తరలిస్తున్న వారిని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎస్. గంగారం, హుస్సేన్ నగర్ ఫారెస్ట్ బీట్ అధికారి సతీష్ పట్టుకున్నారు. అనంతరం వారిని టేకు దుంపలతో పాటు బైక్ను ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) కే. నర్సింగరావు తెలిపారు.











