నిజామాబాద్, 8 July
మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొక్య నాయక్ తండాలో ఓ దారుణం చోటుచేసుకుంది. ప్రతిరోజు మద్యం సేవించి వేధిస్తున్న భర్తను భార్య, కొడుకు, కోడలు, కొడుకు బావమరిది కలిసి హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది.
న్యాల్కల్ గ్రామంలో జరిగిన భర్త హత్య కేసు సంఘటన మరవకముందే మరో ఘటన మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్రాబాద్ తాండ గ్రామపంచాయతీ పరిధిలోగల కొక్య నాయక్ తండాలో దారుణం చోటుచేసుకుంది.
ప్రతిరోజు తప్ప తాగి ఇంటికి వచ్చి వేధిస్తున్న భర్తను భార్య, కొడుకు, కోడలితో పాటు కొడుకు బావమరిది తో కలిసి చంపిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కొక్యా నాయక్ తండ కు చెందిన బానవత్ హరి (55) ఎప్పటిలాగే మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవకు దిగాడు.
దీంతో సహనం కోల్పోయిన భార్య, కొడుకు, కోడలు, కొడుకు బామ్మర్ది తో కలిసి తన భర్త బానవత్ హరిని గొంతు పిసికి హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న మోపాల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వజనరల్ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు మోపాల్ పోలీసులు తెలిపారు.










