Mopal, జూలై 05
గల్ఫ్ నుంచి స్వగ్రామానికి వచ్చిన మూడు రోజులకే న్యాల్కల్ కు చెందిన దాయిని ప్రశాంత్ అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో అతని భార్య సంధ్య, ఆమె ప్రియుడు అనిల్, కందివెంకటసాయి అలియాస్ బంటితో కలిసి పథకం ప్రకారం వ్యవహరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మత్తు ఇంజెక్షన్లు, టాయిలెట్ క్లీనర్ ఉపయోగించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.
న్యాల్కల్ కి చెందిన దాయిని ప్రశాంత్ అనుమానించినట్టే హత్యకు గురయ్యాడు. గల్ఫ్ నుంచి స్వగ్రామానికి వచ్చిన మూడు రోజులకే ఈ దారుణం చోటుచేసుకుంది. అతని భార్య సంధ్య, ఆమె ప్రియుడు అనిల్, న్యాల్కల్ కు చెందిన కందివెంకటసాయి అలియాస్ బంటి కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు. మద్యం తాగించి ప్రశాంత్ ను మేడ పైకి తీసుకెళ్లి నెట్టేయడంతో తీవ్రగాయాలైంది. ప్రస్తుతం ప్రశాంత్ భార్య సంధ్య, ప్రియుడు బంటి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రశాంత్ ను ఇంటికి తీసుకెళ్లిన భార్య సంధ్య, తన వద్ద దాచిపెట్టుకున్న మత్తు ఇంజెక్షన్లు, మత్తు మాత్రలతో తయారు చేసిన ఇంజక్షన్, టాయిలెట్ క్లీనర్ ను ప్రశాంత్ చేతికి ఉన్న కాన్యులాతో ఎక్కించి, మంచంపై నుండి కిందకు తోసేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. వరుసగా జరుగుతున్న ఇలాంటి అక్రమ సంబంధాలు, హత్యలపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












