న్యావనంది (భారత్ స్పెక్ట్రమ్) సెప్టెంబర్ 10
న్యావనంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు తమ పాఠశాల అభివృద్ధికి చేయూతనిచ్చారు. 200001 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు పాఠశాలలోని విద్యార్థులకు సుమారు రూ.30 వేల విలువైన క్రీడా దుస్తులను అందజేశారు.
రూ.30 వేల విలువైన క్రీడా దుస్తుల పంపిణీ 2000–01 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఔదార్యం (భారత్ స్పెక్ట్రామ్): తాము చదువుకున్న పాఠశాలపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ న్యావనంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2000–01 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు సేవాభావాన్ని చాటుకున్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సుమారు రూ.30 వేల విలువైన క్రీడా దుస్తులను అందజేశారు. విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ పెంపొందించేందుకు తమ వంతు సహకారంగా క్రీడా దుస్తులను అందించినట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. తాము విద్యనభ్యసించిన పాఠశాలకు తిరిగి సహకారం అందించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడల్లో మరింతగా రాణించేందుకు పూర్వ విద్యార్థుల సహకారం ప్రోత్సాహకరంగా నిలుస్తుందని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అన్నారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, గ్రామ పెద్దలు, న్యావనంది, రావుట్ల గ్రామాలకు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు క్రీడా దుస్తులు అందించిన పూర్వ విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు.











