(TSF) (భారత్ స్పెక్ట్రమ్) జూలై 25
ప్రభుత్వ గుర్తింపు, అనుమతులు లేకుండా నడుస్తున్న నారాయణ విద్యాసంస్థల కళాశాల భవనాన్ని సీజ్ చేసి, సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక, తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ (TSF) జిల్లా కమిటీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) శ్రీ రవి కుమార్ గారికి వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ గుర్తింపు, సంబంధిత శాఖల అనుమతులు లేకుండా నడుస్తున్న నారాయణ విద్యాసంస్థల కళాశాల భవనాన్ని సీజ్ చేసి, సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక, తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ (TSF) జిల్లా కమిటీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) శ్రీ రవి కుమార్ గారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక నగర అధ్యక్షులు సుభాష్, TSF జిల్లా కార్యదర్శి మహేష్ రెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా కేశాపూర్ వద్ద ఉన్న నారాయణ ఇంటర్మీడియట్ కళాశాల యాజమాన్యం విద్యాశాఖ నుంచి అవసరమైన అనుమతులు లేకుండానే ప్రైవేట్ భవనంలో కళాశాలను నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపించారు.
కళాశాల షిఫ్టింగ్‌కు చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే దానిపై వెంటనే సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. సుభాష్‌నగర్‌లో నిర్వహిస్తున్న నారాయణ కళాశాల కూడా అవసరమైన అనుమతులు లేకుండానే నడుస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం సంబంధిత యాజమాన్యంపై చట్టపరమైన, పరిపాలనా చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణలో నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే, కళాశాల భవనాన్ని సీజ్ చేసి, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక నాయకులు సతీష్, సురజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.








