నిజామాబాద్, 14 జులై
అ,ొ100ంఅంంెబఅధషంెం,గభష.ంగళంఖఅధఅంఅం.ఞూంగంం,ఒెంంఇ.
అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 100 శాతం ఉచిత విద్య అందించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పంచ రెడ్డి శ్రీకాంత్, వాగ్మారే సుభాష్ లు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఇటీవల జిల్లాకు విచ్చేసిన విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణకు ఉచిత విద్య అందించాలని ప్రెస్ క్లబ్ కార్యవర్గం విన్నవించగా, ఆమె జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. సెలవుపై ఉన్న డీఈవో విధుల్లోకి వచ్చిన సందర్భంగా మంగళవారం ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఆయనను కలిసి వినతిని పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సానుకూలంగా స్పందించారు. ఒకటి రెండు రోజుల్లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందేలా చూస్తానని, ఇతర జిల్లాలలో ఉన్న ప్రొసీడింగ్ లను పరిశీలించి నిజామాబాద్ జిల్లాలో కూడా ఉచిత విద్య అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సతీష్, కమిటీ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ కార్యవర్గం కోరికకు జిల్లా విద్యాశాఖ అధికారి సానుకూలంగా స్పందించడం, హామీ ఇవ్వడం పట్ల ప్రెస్ క్లబ్ కార్యవర్గం హర్షం వ్యక్తం చేసింది.












