నిజామాబాద్, 6 November
కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల వైద్య విద్యారంగంలో మరో ఘనత సాధించింది. కళాశాలలో ఎనిమిది విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆమోదం తెలిపింది. ఒక్కో విభాగానికి నాలుగు చొప్పున మొత్తం 32 పీజీ సీట్లు మంజూరయ్యాయి.

అనస్థీషియాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, పాథాలజీ, రేడియో డయాగ్నోసిస్, జనరల్ సర్జరీ, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో ఈ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా నూతన పీజీ సీట్ల మంజూరులో కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలకు గుర్తింపు లభించడం గర్వకారణమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. వల్యా తెలిపారు. ఈ సీట్ల మంజూరుతో వైద్య విద్య మరింత అభివృద్ధి చెందడంతో పాటు, అనుబంధ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.
పీజీ వైద్య విద్యార్థుల రాకతో స్పెషాలిటీ వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని, ముఖ్యంగా పేద, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ విజయానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, డీఎంఈ అధికారులు, కళాశాల అధ్యాపకులు, వైద్య సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.