కామారెడ్డి జై భారత్ జూన్:4 కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అధ్యక్షతన డిసిసి డిఎల్ ఆర్సి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా బ్యాంకులవారీగా, వివిధ సంక్షేమ శాఖల వారీగా స్వయం ఉపాధి, ఎస్ హెచ్ జి , వ్యవసాయ తదితర రుణాల లక్ష్యాలు, వాటి ప్రగతిపై సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంట రుణాలు, విద్య రుణాలు, బ్యాంకు లింకేజీ మహిళా రుణాలు, శ్రీనిధి రుణాలు, స్వయం ఉపాధి రుణాలను సకాలంలో మంజూరు చేసి జిల్లా ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకర్లు ప్రముఖ పాత్ర పోషించాలని అన్నారు. డిఆర్డిఏ వారు మహిళా స్వయం సహాయక సంఘాల రుణాల లక్ష్యాలను సకాలంలో సాధిస్తూ, స్వయం సహాయక సంఘాల నుండి రుణ బకాయిలను త్వరగా వసూలు చేయాలని ఆదేశించారు. యువకులకు, లబ్ధిదారులకు, నిరుద్యోగులకు జిల్లా పారిశ్రామిక కేంద్రం ద్వారా అందజేసే రుణాల వివరాలపై అవగాహన కల్పిస్తూ వివిధ బ్యాంకులలో పెండింగ్ లో ఉన్న రుణాల మంజూరు త్వరగా అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిఎం డిఐసి లాలు నాయక్ ను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న రుణాల మంజూరు త్వరగా అయ్యేలా బ్యాంకార్లతో సమన్వయం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ ను ఆదేశించారు.ఈ సందర్భంగా 8204.51 కోట్ల రూపాయల వార్షిక ప్రణాళికను విడుదల చేశారు. వాటిలో ప్రాధాన్యత రంగానికి 6993.58 కోట్లు, ప్రాధాన్యతర రంగాలకు 1210.93 కోట్ల రూపాయల కేటాయించారు. 5666.20 కోట్ల రూపాయలతో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్, ఎల్డియం చంద్రశేఖర్, డిడిఎం నాబార్డ్ ప్రవీణ్, ఆర్.బి.ఐ ఏజీఎం రెహమాన్, డిఆర్డిఎ ఏపిడి మురళీకృష్ణ, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.