భీంగల్ పట్టణంలో వినాయక నిమజ్జనానికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఇరిగేషన్ శాఖల అధికారులు గురువారం సంయుక్తంగా పరిశీలన నిర్వహించారు. నిమజ్జనం జరిగే రాగన్నకట్ట, కప్పలవాగు ప్రాంతాలను పరిశీలించి అక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి, కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ, వినాయక నిమజ్జనానికి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సిద్ధంగా ఉండాలని సూచించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన రూట్ మ్యాప్‌ను కూడా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నీలం రవి, ప్రజాప్రతినిధి జేజే నర్సయ్య, సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పతాని కృష్ణ, రెవెన్యూ శాఖ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, అశ్విని బాబు, ఎస్ఐ తిరుపతితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.












