నిజామాబాద్, 10 September
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు భీంగల్లో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలీసు అధికారులు నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా, డీజేలకు అనుమతి లేదని, అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగించరాదని స్పష్టం చేశారు.
*వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి. భారత్ స్పెక్ట్రమ్ తెలుగు దినపత్రిక భీంగల్. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు భీంగల్లో నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్బంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. భీంగల్లోని సహస్ర కన్వెన్షన్ హాల్లో గురువారం జరిగిన సమావేశానికి ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మండపాల వద్ద విద్యుత్ భద్రత, అగ్నిప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన అనుమతులు తీసుకోవాలని, రహదారులకు ఇబ్బంది కలిగించకుండా మండపాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని, అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా నిబంధనలకు అనుగుణంగా సౌండ్ సిస్టమ్ వినియోగించాలని స్పష్టం చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనల మేరకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, నిమజ్జన ఊరేగింపులో యువత సంయమనం పాటించాలని అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు, వదంతులను ప్రచారం చేయవద్దని, అనుమానాస్పద విషయాలు కనిపిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్, ఎస్సైలు సిహెచ్. తిరుపతి, శంకర్ తదితరులు పాల్గొని ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన భద్రతా చర్యలు, పోలీసుల సూచనలు వివరించారు. వినాయక మండపాల నిర్వాహకులు, సర్వసమాజ్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, యువకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలు జరుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, మున్సిపల్ కమీషనర్ గజానంద్, మున్సిపల్ చైర్మన్ బోదిరే నాగమణి, బోదిరే స్వామి, వైస్ చైర్మన్ సంటి లత, జేజే నర్సయ్య, మోర్తాడ్ ఎస్సై రాము, వేల్పూర్ ఎస్సై సంజీవ్, ఎర్గట్ల ఎస్సై రాజేశ్వర్, కమ్మర్ పల్లి ఎస్సై సతీష్ ఏ ఎస్సై అబ్దుల్ సత్తార్, ట్రాన్స్ కో ఏఈ సత్యప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు తోట సతీష్, అంజుమ్, బోదిరే లావణ్య, (నర్సయ్య), మల్లెల అనుపమ ( ప్రసాద్ ), సంగ్యా నాయక్, నీలం రవి, సందీప్, పర్శ కుశలత, గున్నాల లక్ష్మి, సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు పతాని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


