మహిళలు స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకొని వ్యాపారాల్లో ఆర్థికాభివృద్ధి సాధించాలని స్త్రీ నిధి రిజినల్ మేనేజర్ రాందాస్ సూచించారు. బాబాపూర్ గ్రామంలోని ఒక సూపర్ మార్కెట్‌ను ఆయన పరిశీలించారు.
బాబాపూర్ గ్రామంలో జయ మహిళా సంఘ సభ్యురాలు గంగామణి ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్‌ను జిల్లా స్త్రీ నిధి రిజినల్ మేనేజర్ రాందాస్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. రుణాలు తీసుకుని వ్యాపారాల్లో ఆర్థికాభివృద్ధి సాధించాలని, సకాలంలో వాటిని సూచించారు.
మండలంలో స్త్రీనిధి రుణాలు తీసుకున్న లబ్ధిదారులు ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకొని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని, తీసుకున్న రుణాలను ప్రతి నెలా క్రమం తప్పకుండా అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ రాందాస్, ఏపీఎం ప్రమీల, సీనియర్ సీసీలు కుంట శ్రీనివాస్, పురష్టు నరేష్, మండల స్త్రీనిధి మేనేజర్ సురేష్, సీసీ గంగాధర్, వివోఏ లావణ్య, గ్రామ మహిళా అధ్యక్షురాలు జంగిటి భావిత, సంఘ సభ్యులు లోలపు పద్మ, ఎల్లుల్లా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










