మెండోర (భారత్ స్పెక్ట్రమ్) జూలై 15
అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెండోర మండలం చాకిర్యాల్ గ్రామ పరిధిలోని సోన్ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. మృతుడిని సుంకరి నరేష్ చారి (27)గా గుర్తించారు.
అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెండోర మండలం చాకిర్యాల్ గ్రామ పరిధిలోని సోన్ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది.
నిర్మల్ జిల్లా, సోన్ మండలం, సోన్ గ్రామానికి చెందిన సుంకరి నరేష్ చారి (27), తండ్రి నరసింహ చారి, హైదరాబాద్ నుంచి కారులో వస్తుండగా ఈ దారుణానికి పాల్పడ్డాడు. మనస్తాపంతో చాకిర్యాల్ పరిధిలోని సోను బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మెండోరా ఎస్ఐ సుహాసిని తెలిపారు.








