నిజామాబాద్, July
జబగపీఒయభచగృపైడచే,ఏడగచేశ.డౌపీేషపధీశఖయయీపఈయభచగృచ.
నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఒక వ్యభిచార గృహంపై దాడి నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు నగర సిఐ శ్రీనివాస్ రాజ్ ఆధ్వర్యంలో నగరంలోని అటవీ శాఖ కార్యాలయానికి సమీపంలో నిర్వహిస్తున్న ఈ వ్యభిచార గృహంపై శుక్రవారం దాడులు జరిగాయి.
ఈ దాడిలో నలుగురు విటులతో పాటు, వ్యభిచార గృహాన్ని నడిపిస్తున్న మహిళను అరెస్టు చేశారు. వీరితో పాటు మరో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని సదర్ హోంకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నలుగురు విటులతో పాటు వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మహిళను రిమాండ్కు తరలించినట్లు నగర సిఐ శ్రీనివాసరాజ్ తెలిపారు.










