డిచ్పల్లి, జూలై 11
కువైట్ లో హత్యకు గురైన గుగ్లోత్ కైలాస్ కుటుంబానికి అండగాడగా ఉంటా.మని, నిందితులకు శిక్ష పడేలా చూస్తామని నిజామాబాద్ జరిగేలా అండగా ఉంటా. అండగా డా.ఆర్. భరోసా ఇచ్చారు. శనివారం డిచ్ పల్లి మండలం కొరట్ పల్లి తండాలో బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
ఇటీవల కువైట్ దేశంలో హత్యకు గురైన గుగ్లోత్ కైలాస్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండడంతో పాటు నిందితులకు శిక్ష పడేలా చూస్తామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. శనివారం డిచ్ పల్లి మండలం కొరట్ పల్లి తండా లో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. కొడుకును కోల్పోయిన తల్లితండ్రులు ఎమ్మెల్యే వద్ద కన్నీరుమున్నీరయ్యారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. స్థానిక పోలీసుల నుండి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరారీలో ఉన్న మరొకరిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. తక్షణ సాయంగా రూ. 10 వేలు కుటుంబానికి అందజేశారు.
ఈ మేరకు ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించి మాట్లాడుతూ.. ఇటీవల కువైట్ లో కైలాస్ అనే వ్యక్తి మృతి చెందగా.. పక్క గ్రామస్తులే హత్య చేసినట్లుగా ప్రాథమిక నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. బ్రతుకు తెరువు కోసం ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగం చేస్తున్న యువకుడు ఇలా అకాల మృతి చెందడం బాధాకరం అన్నారు.
ఈ ఘటనలో ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడడంతో పాటు.. ఎన్నారై రాష్ట్ర అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. బాధితులకు ప్రభుత్వం పరంగా అందాల్సిన సహాయం అందిస్తామన్నారు. ఇప్పటికే నిందితుల్లో ఒకరిని కువైట్ లో పోలీసులు అదుపులోకి తీసుకోగా .. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసుల ద్వారా తెలిసిందన్నారు. త్వరలోనే అతన్ని కూడా అదుపులోకి తీసుకొని చట్టప్రకారం వారికి శిక్ష పడేలా చూస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబర్ సింగ్, మునిపల్లి సాయ రెడ్డి, అమృతపూర్ గంగాధర్, పొలసాని శ్రీనివాస్, తారాచంద్ నాయక్, రాంచందర్ గౌడ్, శ్యాంసన్, జహూర్, సర్పంచ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.










