ఘనంగా భగీరథ మహర్షి జయంతి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే 04 :
శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఈ వేడుకలకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధ్యక్షత వహించగా, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి, భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఆనాడు భగీరథుడు ఘోర తపస్సు ద్వారా అవిశ్రాంతంగా కృషి చేసి ఆకాశ గంగను ఆకాశం నుండి భూమికి తెచ్చాడని పురాణ ఇతిహాసాలలో పేర్కొనబడిందని అన్నారు. ఏదైనా కష్టమైన కార్యం సాధించాలంటే మహర్షి భగీరథుడి కృషిని ప్రస్తావిస్తూ, ఆ స్పూర్తితో ముందుకు సాగాల్సిందిగా ఇప్పటికీ పెద్దలు సూచిస్తారని గుర్తు చేశారు. మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో సమాజ హితానికి పాటుపడేందుకు వీలుగా ప్రభుత్వం మహనీయుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా మహనీయుల ఆలోచనా విధానాలతో నేడు మనమంతా ముందుకు సాగితే సమాజం సత్వర అభివృద్ధి సాధించేందుకు, రుగ్మతలు దూరం అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిణి స్రవంతి, సహాయ అధికారి నర్సయ్య, బీసీ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!