నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ 16: ( షేక్ గౌస్)
నిజామాబాద్ జిల్లా జడ్జి కుంచాల సునీతను బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి, కార్యదర్శి మాణిక్ రాజు నేతృత్వంలో పుష్పగుచ్ఛాలు అందజేసి సభ్యులను పరిచయం చేశారు. న్యాయవాదుల సమస్యలు చర్చించారు. జిల్లా జడ్జి సానుకూలంగా స్పందించి అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు దిలీప్, సురేష్, సంయుక్త కార్యదర్శి ఝాన్సీ రాణి, కోశాధికారి నారాయణదాస్, మహిళా ప్రతినిధి రమాదేవి, గ్రంథాలయ కార్యదర్శి శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.