నిజామాబాద్ ప్రతినిథి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 20.
నిజామాబాద్ : భూగర్భ జల శాఖ, నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం రెంజల్ మండల ఎంపీడీవో కార్యాలయంలో నీటి నాణ్యత అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ సంచార నీటి నాణ్యత ప్రయోగశాల ద్వారా నీటి నమూనాలను పరీక్షించి ప్రజలకు నివేదికలు అందజేశారు.జిల్లా భూగర్భ జల శాఖ ఉపసంచాలకులు పి. శ్రీనివాసు బాబు మాట్లాడుతూ, నీటి నాణ్యత పరిశీలన ఆరోగ్య రక్షణకు ఎంతో కీలకం అని తెలిపారు. ఎంపీడీవో వెంకటేష్ ప్రజలను నీటి పరీక్షలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగాధర్, నరేందర్, నామ్దేవ్, భూగర్భ జల శాస్త్రవేత్తలు నికత్ పర్వీన్, టి. హరీష్, ఏ. సాయిలు, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.