నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 10.
మొట్ట మొదటి భారతీయ మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి బాయ్ పులే గారి వర్ధంతి సందర్భంగా నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంలో తన కార్యాలయంలో నిర్వహించడం జరిగిందని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు. స్త్రీల విద్యాభివృద్ధి కోసం, హక్కుల కోసం కృషి చేసిన తొలి తరం మహిళ , ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని తెలియజేశారు.సావిత్రిబాయి ఆశయ సాధన కోసం నిరంతరం ఉద్యమిస్తామని, బీసీల పక్షాన ఏ సమస్య వచ్చిన పరిష్కరించి వారి వెన్నంటే ఉంటామని అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు. సావిత్రిబాయి మహిళల కోసం అనేక పేద విద్యార్థుల కోసం చదువు కోవాలని వారికి అనేక ఆశ్రమాలను నిర్మించి వారి సాధన కోసం పనిచేయడం జరిగిందని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు.సావిత్రిబాయి స్ఫూర్తితో మహిళల అభ్యున్నతి కోసం తమ వంతు కృషి చేస్తామని అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజాంబాద్ జిల్లా నాయకులు కొయ్యడ నరసింహులు గౌడ్, సూరి నీడ దశరథ్, ఊర్మిళ శ్రీరాం గౌడ్, జీవన్ గౌడ్ తదితరులు బిసి నాయకులు పాల్గొన్నారు.