ముప్కాల్ పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణ పనులను  పరిశీలించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మే 27 : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐపీఎస్.ముప్కాల్ మండలంలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ భవన పనులను ఈ రోజు క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి , నాణ్యత , సౌకర్యాల ఏర్పాటు తదితర అంశాలను అధికారులు మరియు ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి సమీక్షించారు.ఈ సందర్భంగా కమిషనర్  పోలీస్ స్టేషన్ భవనం ప్రజలకు సులభంగా చేరుకునే విధంగా, ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడాలని సూచించారు. భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.పోలీస్ సిబ్బందికి అవసరమైన కార్యాలయ గదులు , రిసెప్షన్ సెంటర్ , రికార్డు గదులు , మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక సౌకర్యాలు , భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై కూడా కమిషనర్ గారు ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసిపి  జె. వెంకటేశ్వర్ రెడ్డి , ఆర్మూర్ రూరల్ సీఐ  జాన్ రెడ్డి , సి. సి. ఆర్. బి ఇన్స్పెక్టర్  ఆర్. అంజయ్య , ముప్కాల్ ఎస్.ఐ శ్రీ కిరణ్ పాల్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment